ఈ ఏడాదే తరగతులను ప్రారంభించాలి
- ఢిల్లీలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖ కార్యదర్శిని కలిసిన ఎంపీ, ఎమ్మెల్యే
-కేంద్ర కార్యదర్శి నుంచి సానుకూల స్పందన
మంచిర్యాలలో ఈ ఏడాదే మెడికల్ బోధనా కళాశాల తరగతులను ప్రారంబించాలని పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావులు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజ్ భూషణ్ ను కోరారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో ఆయనను కలిసి మెడికల్ కళాశాల తరగతుల ప్రారంభం ఆవశ్యకతతో పాటు పలు విషయాలను చర్చించారు . ఈ ప్రాంతంలో మెడికల్ కళాశాల తరగతులు ప్రారంభమైతే పేద ప్రజలకు వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంటాయని ఆయనకు వివరించారు. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకే కాకుండా మహారాష్ట్ర నుండి వచ్చే వారికి సైతం ఉపయోగకరంగా ఉంటుందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే తరగతులు ప్రారంభించాలని విన్నవించారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారు.
మంచిర్యాల మెడికల్ కళాశాల విషయంలోనే ఈ నెల 26న రాష్ట్ర ఆరోగ్య వైద్యశాఖ మంత్రి హరీష్ రావును కలిశారు. కళాశాల బోధన తరగతుల ప్రారంభ విషయమై మాట్లాడారు.
ఈ విషయమై తనవంతు ప్రయత్నాలు చేస్తానని హామీ ఇచ్చారు.