కోళ్లు.. క్వార్టర్లు…
-కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన నేపథ్యంలో..
-మందు, కోళ్లు పంచిన టీఆర్ఎస్ నేత
TRS leader who distributed chickens, quarters: ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ ప్రకటనతో ఆయన ప్రధానమంత్రి కావాలని కోరుతూ టీఆర్ఎస్ నాయకులు కోళ్లు, క్వార్టర్ బాటిళ్లు పంచారు. ఈ ఘటన వివాదస్పదం కావడంతో దానిని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. వరంగల్ చౌరస్తాలో అధికార పార్టీ నేత రాజనాల శ్రీహరి సుమారు 200 మంది హమాలీలకు కోళ్లు, మద్యం బాటిళ్లను పంపిణీ చేశారు. కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన సందర్భంగా క్వార్టర్ మందు సీసా, కోడిని పంపిణీ చేశారు.
అయితే, అధికార పార్టీలో ఉంటూ మద్యం పంపిణీ చేయడం అనేక విమర్శలకు దారితీస్తోంది. దసరా కానుకగా హమాలీలకు మద్యం, కోళ్లు పంచడంపై కొంతమంది కావాలనే తప్పు పడుతున్నారని టీఆర్ఎస్ నేత రాజనాల శ్రీహరి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాలలో తనకంటూ ప్రత్యేకముద్ర వేసుకుంటారని జోస్యం చెప్పారు. కేసీఆర్, కేటీఆర్ ప్లెక్సీలు పెట్టి మరీ మందు, కోళ్లను పంపిణీ చేయడం కొసమెరుపు.