బిగ్ బ్రేకింగ్… అసెంబ్లీ ఆవరణలో తుపాకుల కలకలం
సిబ్బంది చెట్లను శుభ్రం చేస్తుండగా దొరికిన రివాల్వర్లు
Three guns in Telangana assembly premises: అసెంబ్లీలో ఆవరణలో మూడు తుపాకులు దొరకడం కలకలం సృష్టించింది. అసెంబ్లీ ఆవరణలో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు చెట్లను శుభ్రం చేస్తుండగా ఈ మూడు రివార్వర్లు కనిపించాయి. చెట్ల పొదలలో 1 తపంచా, 2 కంట్రీ మేడ్ రివాల్వర్లు దొరికాయి. వెంటనే సిబ్బంది సైఫాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మూడు రివ్వాల్లరను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే అవన్నీ తుప్పు పట్టి ఉండటం గమనార్హం.