బాసర ట్రిపుల్ ఐటీ లో ర్యాగింగ్ కలకలం
A raging commotion in Basara Triple IT: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో ర్యాగింగ్ వ్యవహారం కలకలం రేపుతోంది. జూనియర్లను సీనియర్లు వేధిస్తున్నారంటూ అసిస్టెంట్ డీన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొంతకాలంగా క్యాంపస్లో ర్యాగింగ్ సాగుతున్నట్లుగా ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు ఐదుగురు సీనియర్ విద్యార్ధులపై కేసు నమోదు చేశారు.