మోదీ తల్లి హీరాబెన్ పరిస్థితి విషమం
-అహ్మదాబాద్ ఆసుపత్రిలో చికిత్స
-ఆస్పత్రికి చేరుకుంటున్న బీజేపీ శ్రేణులు
Modi’s mother Heeraben’s condition is critical: ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ మోదీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమెను అహ్మదాబాద్‌లోని యుఎన్ మెహతా ఆసుపత్రిలో చేర్పించారు. వయసు రీత్యా, ఆరోగ్యం విషమించడంతో తెల్లవారుజామున అహ్మదాబాద్‌లోని యుఎన్ మెహతా ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. తల్లి ఆరోగ్య వార్త తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ మధ్యాహ్నం వరకు వచ్చే అవకాశం ఉంది. ఆమె ఆరోగ్య వార్త విన్న ఎమ్మెల్యేలు UN మెహతా ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీస్తున్నారు. అహ్మదాబాద్ ఎమ్మెల్యే దర్శనాబెన్ వాఘేలా, దర్యాపూర్ ఎమ్మెల్యే కౌశిక్ జైన్ UN మెహతా ఆసుపత్రికి చేరుకున్నారు.
ప్రధానమంత్రి మోదీ తల్లి హీరాబెన్ వయస్సు 100 ఏళ్లు. ఈ ఏడాది జూన్‌లో ఆమె తన 100వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ స్వయంగా ఆమెకు కాళ్లు కడిగి ఆశీస్సులు తీసుకున్నారు. ఆమె అనారోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. హీరా బెన్ గాంధీనగర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ తమ్ముడు పంకజ్‌భాయ్‌తో కలిసి బృందావన్ బంగ్లాస్-2, రైసన్, గాంధీనగర్‌లో నివసిస్తున్నారు.
హీరాబా జూన్ 18, 1923న జన్మించారు. హీరాబెన్ మోదీ 18 జూన్ 2022న తన జీవితంలో 100వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈ ఏడాది కూడా గాంధీనగర్ రైసన్‌లోని తన తల్లి పుట్టిన రోజు సందర్భంగా ఆశీస్సులు తీసుకోవడానికి ప్రధాని మోదీ ఇంటికి చేరుకున్నారు. ఉదయాన్నే తన నివాసానికి చేరుకుని హీరాబా ఆరోగ్యంగా, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.