వేటగాళ్ళ ఉచ్చుకు విద్యార్ధి బలి
A student is a victim of poachers’ trap: వేటగాళ్ళ ఉచ్చుకు ఓ నిండు ప్రాణం బలయ్యింది. చేనుకు కాపలా వెళ్లిన విద్యార్థి వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి మృత్యువాత పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. కొమురంభీం కాగజ్నగర్ మండలంలోని కోసిని గ్రామనికి చెందిన ఆదే విఘ్ణ (18) అనే ఇంటర్ విద్యార్థి పర్దాన్ గూడ శివారు లోని రాత్రి చేనుకు కాపలకు వెళ్ళాడు. నూతన సంవత్సరం కావడంతో అక్కడే దావత్ ఏర్పాట్లు సైతం చేసుకొన్నారు. అయితే అక్కడే వేటగాళ్ళు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి చనిపోయాడు. పోలిసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.