తల్లుల చెంతకు శిశువులు…
డీఎన్ఏ టెస్ట్‌తో తేల్చిన అధికారులు
జిల్లా ఆసుపత్రిలో శిశువుల తారుమారుపై సస్పెన్స్ వీడింది. డీఎన్ఏ నివేదికతో ఉత్కంఠకు తెర పడింది. డీసీపీ కార్యాలయంలో అధికారులు… డీఎన్ఏ రిపోర్ట్ షీల్డ్ కవర్‌ను విప్పారు. పుట్టిన బాబు ఆసిఫాబాద్‌కు చెందిన పావని బిడ్డగా నిర్దారించారు. అలాగే పాప కోటపల్లి మండలం రొయ్యల పల్లికి చెందిన మమత బిడ్డగా గుర్తించారు. అనంతరం ఇద్దరు శిశువుల తండ్రులకు డీసీపీ అఖిల్ మహాజన్ కౌన్సిలింగ్ నిర్వహించారు. గత నెల 27న జిల్లా ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం వల్ల శిశువులు తారుమారయ్యారు. పుట్టిన బాబు మావాడేనని రెండు కుటుంబాలు పట్టుబట్టాయి. నిజాన్ని తేల్చేందుకు అధికారులు డీఎన్ఏ టెస్టు నిర్వహించారు. తన బాబును తనకి అప్పగించడంతో పావని ఆనందం వ్యక్తం చేసింది.