బ్రేకింగ్.. భర్తను హత్య చేసిన భార్య
A wife who killed her husband:మద్యానికి బానిసైన భర్తను బార్య హత్య చేసిన ఘటన కాసిపేట మండలంలో చోటు చేసుకుంది. కాసిపేట మండలం తంగళ్లపల్లికి చెందిన దుంపటి మహేశ్(40) తాగుడుకు బానిస అయ్యాడు. తాగి వచ్చి నిత్యం భార్య లావణ్యను కొట్టేవాడు.
ఆదివారం సైతం తాగి ఇంటికి రావడంతో భార్య భర్తల మద్య గొడవ జరిగింది. దీంతో భార్య ఇనుప రాడ్డుతో భర్తను తలపై కొట్టడంతో మృతి చెందాడు. దేవాపూర్ ఎస్ఐ విజయేందర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.