తెలంగాణ ఎమ్మెల్యేలకు తప్పిన ప్రమాదం
Telangana: మహరాష్ట్రలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ ఎమ్మెల్యేలకు ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యేలు ప్రయాణిస్తున్న వాహనానికి ఓ పశువు అడ్డు వచ్చింది. దానిని తప్పించ బోయి కారు డివైడర్ ఢీ కొట్టింది. ఆ వాహనం ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నది కాగా, ప్రమాద సమయంలో వాహనంలో జోగురామన్న, కోనప్ప, మాజీ ఎంపీ నగేష్ ఉన్నారు. వారు ఆదిలాబాదు నుండి నాగ్ పూర్ వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. మహారాష్ట్రలోని పాండ్రా కొడ, బోరీ మధ్య ఎమ్మెల్యేలు ప్రయాణిస్తున్న వాహనానికి ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం లో ఎవరికీ ఏం కాలేదని అధికార వర్గాలు వెల్లడించాయి. అనంతరం వేరే వాహనం ద్వారా ఎమ్మెల్యేలు జోగు రామన్న, కోనేరు కోనప్ప, మాజీ ఎంపీ నగేష్ నాగ్పూర్ వెళ్లిపోయారు.