పన్నెండోసారి వ్యాక్సిన్ వేసుకుంటూ దొరికిపోయాడు

దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. అయితే ఇంకా రెండో డోసు తీసుకోని వారు కోట్ల సంఖ్యలో ఉన్నారు. అలాంటిది బీహార్ కు చెందిన 84ఏళ్ల వ్యక్తి ఇప్పటికే 11సార్లు కొవిడ్ వ్యాక్సిన్ తీసుకుని 12వ డోసుకు వెళ్లాడు. విష‌యం తెలుసుకున్న అధికారులు నోరెళ్ల పెడుతున్నారు. అన్ని సార్లు వ్యాక్సిన్ తీసుకోవడానికి సహకరించిన అధికారులను కనుగొనేందుకు విచారణ జరుపుతున్నారు.

మధేపురా జిల్లాలోని బ్రహ్మదేవ్ మండలం ఒరై గ్రామ వాసి అయిన వ్యక్తి 12వ డోస్ తీసుకుంటుండగా పట్టుబడ్డాడు. పోస్టల్ డిపార్ట్ మెంట్ లో రిటైర్ అయిన ఉద్యోగి ఇప్పటికే పలు మార్లు వ్యాక్సిన్ తీసుకున్నానని చెప్తున్నాడు. ‘వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్ గా అనిపించింది. అందుకే రిపీటెడ్ గా తీసుకుంటూనే ఉన్నా’ అని చెప్తున్నాడు.2021 ఫిబ్రవరి 13న తొలి డోస్ తీసుకున్నాడట. ఆ తర్వాత మార్చి, మే, జూన్, జులై, ఆగష్ట్ నెలల్లో ఒక్కో డోసు తీసుకుని సెప్టెంబర్ నెలలో మూడు డోసులు తీసుకున్నాడట. డిసెంబర్ నాటికి 11 వ్యాక్సిన్ డోసులు తీసుకున్న ఆ వృద్ధుడు మరో డోసు కోసం వచ్చి దొరికిపోయాడు.

తన అనుభవాన్ని చెప్తూ.. ‘గవర్నమెంట్ ఒక అద్భుతమైన సంగతి సృష్టించింది’ అంటున్నాడు. విచారణలో అతను ఎనిమిది సార్లు తన ఫోన్ నెంబర్ నే వాడి వ్యాక్సిన్ వేయించుకోగా ఓటర్ ఐడీ, తన భార్య ఫోన్ నెంబర్ లు వాడి మరో మూడు సార్లు వ్యాక్సిన్ తీసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు సైతం అతని వైఖరి చూసి నోరెళ్లబెడుతున్నారు

Get real time updates directly on you device, subscribe now.

You might also like