సంస్కృతి, సంప్రదాయాలకు చిహ్నాలు ముగ్గులు

కోరమండల్ కంపెనీ సీనియర్ జోనల్ మేనేజర్ జిల్లాల సజన్ కుమార్

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు చిహ్నాలు ముగ్గుల‌ని కోరమండల్ కంపెనీ సీనియర్ జోనల్ మేనేజర్ జిల్లాల సజన్ కుమార్ తెలిపారు. సంకాంత్రి పండుగ‌ పుర‌స్క‌రించుకుని ఉమ్మ‌డి కరీంనగర్, ఉమ్మ‌డి వరంగల్ , ఉమ్మ‌డి ఖమ్మం జిల్లాల వ్యాప్తంగా ముగ్గుల పోటీలు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా తెలుగు ప్రజలు నిర్వహించుకునే ముఖ్య పండుగలో సంక్రాంతి ఒకటన్నారు. మ‌హిళ‌లు ఉద‌య‌మే ఇంటి ముంద‌ర ముగ్గులు వేయ‌డం మంచి వ్యాయామ‌న్నారు. అంతేకాకుండా, వారిలో ఉన్న సృజ‌నాత్మ‌క వెలికితీయ‌డానికి ముగ్గులు ఎంత‌గానో ఉప‌యోప‌డ‌తాయ‌ని స్ప‌ష్టం చేశారు. కోర‌మాండ్ ఇంట‌ర్నేట‌ష‌న‌ల్ లిమిటెడ్ ఆధ్వ‌ర్యంలో ఈ ముగ్గుల పోటీల్లో పెద్ద ఎత్తున మ‌హిళ‌లు, మ‌హిళా రైతులు పాల్గొన్నారు. కార్యక్రమంలో సీనియర్ అగ్రానమిస్ట్ వినోద్, మార్కెటింగ్ అధికారులు సుమ‌న్‌రెడ్డి, రాజేష్‌, శ్రీ‌ధ‌ర్ రెడ్డి, రాహుల్‌, ఫ‌ణికుమార్‌, న‌రేష్‌, సురేష్‌, వాసు, మ‌ల్లికార్జున్‌, అగ్రాన‌మిస్టులు వెంక‌న్న‌, పృథ్వీ పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like