BRS పార్టీకి 18 మంది ఆదివాసీ స‌ర్పంచ్‌ల రాజీనామా

-గ్రామీణ ప్రాంతాల్లో స‌రైన అభివృద్ధి జ‌ర‌గడం లేదు
-ఎమ్మెల్యే ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆందోళ‌న‌
-ప్ర‌జ‌ల ముందు త‌లెత్తులేక‌పోతున్నాం

18 tribal sarpanchs resign from BRS party: ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో BRS పార్టీకి భారీ షాక్ త‌గిలింది. కొమురంభీమ్ జిల్లాలో ఆ పార్టీకి 18 మంది స‌ర్పంచ్‌లు రాజీనామా చేశారు. వీరంతా ఆదివాసీ స‌ర్పంచ్‌లు కావ‌డం గ‌మ‌నార్హం. త‌మ గ్రామాల అభివృద్ధికి నిధులు స‌క్ర‌మంగా ఇవ్వ‌డం లేద‌ని వారు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే సైతం త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌త్యేక తెలంగాణ ఏర్పాటైన త‌ర్వాత రెండు సార్లు టీఆర్ఎస్ అధికారంలోకి వ‌చ్చింద‌ని, కొమురం భీమ్ జిల్లాలో ఇప్ప‌టి వ‌ర‌కు గ్రామీణ ప్రాంతాల్లో స‌రైన రోడ్డు సౌక‌ర్యం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఏ పార్టీ మ‌ద్ద‌తు లేకుండా గెలిచామ‌న్నారు. తామంతా స్వ‌తంత్రుల గెలుపొందిన‌ట్లు వెల్ల‌డించారు. ప్ర‌భుత్వం అభివృద్ధి కోసం నిధులు ఇస్తుంద‌ని, త‌మ‌ను ప్రోత్స‌హిస్తుంద‌ని బీఆర్ఎస్ లో చేరామ‌ని స్ప‌ష్టం చేశారు.

ఆదివాసీ గూడెల్లో, మా గ్రామ పంచాయ‌తీ ప‌రిధిలో చాలా స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని త‌మ‌కు స‌మ‌యం కేటాయించాల‌ని ఎమ్మెల్యే ఆత్రం స‌క్కు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆదివాసీ ఎమ్మెల్యే అయి ఉండి కూడా ఆదివాసీల స‌మ‌స్య‌లు ప‌ట్టించుకోక‌పోవ‌డం దారుణ‌మ‌ని అన్నారు. ఇక తాము పార్టీలో ఉండి ఏం లాభ‌మ‌ని దుయ్య‌బ‌ట్టారు.

గ్రామ పంచాయ‌తీల‌కు వ‌చ్చిన నిధులు సైతం తాము స్వేచ్ఛ‌గా ఖ‌ర్చు పెట్టుకునే ప‌రిస్థితి లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌మ ప‌ద‌వీ కాలం చివ‌రి ద‌శ‌కు వ‌చ్చినా కూడా అభివృద్ధి ప‌నుల‌కు సంబంధించిన బిల్లులు చెల్లించ‌లేక‌పోతున్నామ‌ని అన్నారు. ఇక భూ ప్ర‌క్షాళ‌న త‌రువాత చాలా మంది రైతుల‌కు కొత్త ప‌ట్టాలు రాలేద‌ని తెలిపారు. కార్యాల‌యాల చుట్టూ తిరిగినా ఎలాంటి ఫ‌లితం లేద‌ని స్ప‌ష్టం చేశారు. కొత్త రేష‌న్ కార్డులు రాలేద‌ని, డ‌బుల్ బెడ్‌రూం ఇండ్లు ఎప్పుడు ఇస్తార‌ని ప్ర‌జ‌లు నిల‌దీస్తున్నార‌ని వారి ముందు త‌లెత్తులేక‌పోతున్నామ‌ని వారు స్ప‌ష్టం చేశారు. అందుకే తాము పార్టీకి రాజీనామా చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.

రాజీనామా చేసిన స‌ర్పంచ్‌లు వీరే…

పేరు – గ్రామ పంచాయ‌తీ
కొట్నాక కిష్టు – పాట‌గూడ‌
సిడం అన్నిగా – చౌప‌న్‌గూడ
కొర్కెట దేవ్‌రావు – స‌వారి
కొర్వెత జంగు – చిచ్చుప‌ల్లి
సెడ్మ‌కి దౌల‌త్ – గోయ‌గాం
జుగ్న‌క మ‌నోహ‌ర్ – వెల్గి
పెందూర్ ప‌వ‌న్ – ఖ‌మాన‌
అడ జ‌య‌రాం – న‌వేధ‌రి
మ‌డావి లింగుబాయి – దొడ్డిగూడ‌
సెడ్మ‌కి గంగారాం – ఖిరిడి
మ‌డావి బాలు – న‌వేగామ్
మ‌డావి రేణుక – న‌వేగూడ‌
కోట్నాక సుమిత్ర – దాభ
కిన‌క గంగూబాయి – సోనాపూర్‌
పెందూర్ సుగంధ‌బాయి – ఖ‌న‌ర్‌గాం
రాయిసిడాం మంగ‌ళ – కోమ‌టిగూడ‌
ముచ్చినేని పోచ‌క్క – బెంబూల్‌ధ‌ర‌
తాటికుమారి – లెండిగూడ‌

Get real time updates directly on you device, subscribe now.

You might also like