18 వేల కోట్లు వ‌సూలు చేశాం

విజ‌య్ మాల్యా, నీర‌వ్‌మోదీ, మెహుల్ చోక్సీ కేసుల్లో కేంద్రం ప్ర‌క‌ట‌న

భారత్‌లోని బ్యాంకుల నుంచి రూ.వేల కోట్లలో అప్పులు తీసుకుని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్తలు విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ కేసులో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వారి నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ రూ.18 వేల కోట్లు వసూలు చేసిందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమాచారం ఇచ్చింది. 2002లో నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం తీసుకొచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 4,700 కేసులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారించినట్టు తెలిపింది. అన్ని కేసుల్లో కలిపి మొత్తం రూ. 67 వేల కోట్లను ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్నట్టు ప్రభుత్వం కోర్టుకు వివరించింది.

మనీల్యాండరింగ్ కేసుల్లో ఈడీకి విశేష అధికారాలను కట్టబెట్టడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై బుధవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ వివరాలను సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం అందజేసింది. ఈ కేసులో కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా విచారణకు హాజరయ్యారు. బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి పారిపోయిన వారికి కోర్టులు కల్పిస్తున్న రక్షణ కారణంగా పెద్ద మొత్తంలో రావాల్సిన డబ్బు ఇప్పటికీ నిలిచిపోయిందన్నారు. రికవరీ దశను దాటలేదని గణాంకాలు చెప్తున్నాయని ఆయన కోర్టుకు వివరించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like