రూ.30 వేల కోట్ల మ‌ద్యం అమ్మ‌కాలు

తెలంగాణలో 2021లో మద్యం ఏరులై పారింది. 2020లో కొవిడ్‌ ఆంక్షల కారణంగా కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా మందకొడిగా సాగిన అమ్మకాలు 2021లో మాత్రం దూసుకెళ్లాయి. కేవ‌లం ఈ ఐదు రోజుల్లోనే రూ.902 కోట్లకు పైగా విక్రయాలు జరిగాయంటేనే మందుబాబుల దూకుడు ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. డిసెంబరు నెలలో గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఏకంగా రూ.3,435 కోట్లకు(2020 డిసెంబరులో రూ.2764 కోట్లు) అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.

అధికారిక లెక్కల ప్రకారం… డిసెంబరు 27న 202.42 కోట్లు, 28న 155.48 కోట్లు, 29న రూ.149.53, 30న రూ.246.56 కోట్లు, 31న రాత్రి 7 గంటల వరకు రూ.148.52 కోట్ల అమ్మకాలు సాగాయి. 2020లో మొత్తం రూ.25,601.39 కోట్ల అమ్మకాలు జరగ్గా, 2021లో శుక్రవారం సాయంత్రానికే రూ.30,196 కోట్ల మేర నమోదయ్యాయి. మొత్తంగా ఏడాదంతా 3,68,68,975 కేసుల లిక్కర్‌, 3,25,82,859 కేసుల బీర్లు అమ్ముడైనట్టు ఎక్సైజ్‌ శాఖ లెక్క తేల్చింది. ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే అత్యధికంగా రూ.6,979 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఆ తర్వాత నల్గొండ రూ.3,288 కోట్లు, హైదరాబాద్‌ రూ.3,201 కోట్ల అమ్మకాలు జరిగాయి.

Get real time updates directly on you device, subscribe now.

You might also like