35 యూట్యూబ్ ఛాన‌ళ్ల బ్లాక్

న్యూఢిల్లీ : 35 యూట్యూబ్ ఛాన‌ళ్ల‌ను బ్లాక్ చేస్తున్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. మ‌న దేశానికి వ్య‌తిరేకంగా ప‌నిచేస్తున్న యూట్యూబ్‌ ఛానెళ్లను సుమారు 35 బ్లాక్‌ చేసింది. భారత సాయుధ బలగాలు, కాశ్మీర్, భారత్‌ విదేశీ సంబంధాలు, మాజీ సీడీఎస్‌ బిపిన్ రావత్ మరణం వంటి విషయాలకు సంబంధించి త‌ప్పుడు స‌మాచారం ఉంద‌ని కేంద్రం తెలిపింది.

ఈ మేరకు 35 యూట్యూబ్ ఛానెల్‌లు, రెండు ట్విట్టర్ ఖాతాలు, రెండు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు, రెండు వెబ్‌సైట్లు, ఒక ఫేస్‌బుక్ ఖాతాను బ్లాక్ చేసినట్లు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ విక్రమ్ సహాయ్ శుక్రవారం తెలిపారు. ఈ ఖాతాలన్నీ పాకిస్తాన్‌ నండి పనిచేస్తాయని, పైగా భారత్‌కి వ్యతిరేకంగా నకిలీ వార్తలను, కంటెంట్‌లను వ్యాప్తి చేయడమే ముఖ్యోద్దేశం అని పేర్కొన్నారు. అంతేకాదు బ్లాక్‌ చేసిన ఖాతాలకు సుమారు 130 కోట్ల వ్యూస్‌, దాదాపు 1.2 కోట్ల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారని విక్రమ్‌ సహాయ్‌ అన్నారు.

ఈ మేరకు బ్లాక్‌ చేసిన ఖాతాలలో అప్నీ దునియా నెట్‌వర్క్ 14 యూట్యూబ్ ఛానెల్‌ళ్లను నిర్వహిస్తోందని, తల్హా ఫిల్మ్స్ నెట్‌వర్క్ 13 యూట్యూబ్ ఛానెళ్లను నిర్వహిస్తున్నాయని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ 2021 నిబంధన16 ప్రకారం జారీ చేసిన ఆదేశాలను ఈ ఖాతాలు ఉల్లంఘించాయని పేర్కొంది

Get real time updates directly on you device, subscribe now.

You might also like