70 క్వింటాళ్ల బియ్యం ప‌ట్టివేత‌

-ఒక వ్యాన్ స్వాధీనం, ఇద్ద‌రి అరెస్టు
-ప‌రారీలో మ‌రో న‌లుగురు నిందితులు

మంచిర్యాల : అర్ధ‌రాత్రి అక్ర‌మంగా మ‌హారాష్ట్రకి త‌ర‌లిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివ‌రాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ కాల్ టెక్స్ బ్రిడ్జి వద్ద పక్కా సమాచారం తో బియ్యం ర‌వాణా చేస్తున్న వ్యాన్‌ను ప‌ట్టుకున్నారు. ఏపీ 29 టీబీ 3873 నంబర్ గల ఐచర్ వాహనాన్ని ఆపి తనిఖీ చేసి, అందులో అక్రమంగా తరలిస్తున్న 70 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు విచార‌ణ చేయ‌డంతో రెబ్బన కి చెందిన కొలిపాక కిరణ్ కుమార్ అనే వ్యక్తి తమకు డబ్బులిచ్చి బియ్యం ర‌వాణా చేయాల్సిందిగా కోరిన‌ట్లు వెల్ల‌డించారు. మందమర్రి కి చెందిన రాజు, కనకయ్య అనే వ్యక్తుల వద్ద నుండి బియ్యాన్ని లోడ్ చేసుకుని మహారాష్ట్ర లోని వీరూర్ కి త‌ర‌లిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. బియ్యం త‌ర‌లిస్తున్న ఆసిఫాబాద్ జిల్లా గోలేటీకి చెందిన మల్రాజ్ నరేష్, కాసిపేట మండ‌లం తంగ‌ళ్ల‌ప‌ల్లికి చెందిన ప‌నాస సురేంద‌ర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌లో నిందితులైన రెబ్బ‌న‌కు చెందిన కొలిపాక కిర‌ణ్‌కుమార్‌, మంద‌మ‌ర్రి విద్యాన‌గ‌ర్‌కు చెందిన క‌న‌క‌య్య‌, మంద‌మ‌ర్రి విద్యాన‌గ‌ర్‌కు చెందిన మోటాం రాజు, మ‌హారాష్ట్రలోని వీరూర్‌కు చెందిన ప్ర‌దీప్ ప‌రారీలో ఉన్న‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా 70 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం, ఐచ‌ర్ వ్యాన్‌ను స్వాధీనం చేసుకున్నారు. త‌ర్వాత విచార‌ణ కోసం బెల్లంప‌ల్లి టూ టౌన్ పోలీసుల‌కు అప్ప‌గించిన‌ట్లు వెల్ల‌డించారు. ఈ టాస్క్ లో రామగుండం టాస్క్ ఫోర్స్ సీఐ మహేందర్‌, టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ లచ్చన్న , టూ టౌన్ ఎస్ఐ జీవన్ , టాస్క్ ఫోర్స్ సిబ్బంది రాకేష్, శ్యామ్ సుందర్, శ్రీనివాస్, భాస్కర్ గౌడ్, సంపత్ కుమార్ పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like