కాంగ్రెస్ పార్టీలో చేరిక‌ల జోరు

Kokkirala PremSagar Rao: మంచిర్యాల కాంగ్రెస్ పార్టీలో చేరిక‌ల జోరు కొన‌సాగుతోంది. బీఆర్ఎస్‌తో పాటు ఇత‌ర పార్టీల నుంచి నేత‌లు కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ప‌లు చోట్ల స‌ర్పంచ్‌లు, కౌన్సిల‌ర్ల‌తో పాటు నేత‌లు సైతం కాంగ్రెస్ బాట ప‌డుతున్నారు. శుక్ర‌వారం మంచిర్యాల మున్సిపల్ మాజీ చైర్మన్ మామిడి శెట్టి వసుంధర, మాజీ కౌన్సిలర్ మామిడి శెట్టి రమేష్ తో స‌హా ప‌లువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రేమ్ సాగర్ రావు వారికి కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ తొమ్మిదేండ్ల పాల‌న‌లో బీఆర్ఎస్ చేసిందేమీ లేద‌న్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీ ప‌ట్ల ప్ర‌జ‌ల‌కు పూర్తి న‌మ్మ‌కం క‌లిగింద‌ని స్ప‌ష్టం చేశారు.

You might also like