రాష్ట్రస్థాయి చెస్ పోటీలకు సుకీర్తి
రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు అంబటి సుకీర్తి ఎంపికయ్యారు.
జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన అండర్-11 చెస్ పోటీల్లో బాలికల విభాగంలో ఎస్ఆర్ హైస్కూల్ విద్యార్ధి అంబటి సుకీర్తి జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని ఆర్గనైజింగ్ సెక్రెటరీ స్వామి వెల్లడించారు. రెండు,మూడు స్థానాల్లో శన్విత, అక్షర వీణ నిలిచారు.బాలుర విభాగంలో ఫస్ట్ ప్లేస్ లో రుద్ర కేదార్, రెండు మూడు స్థానాల్లో శ్రీజన్, అయాన్ విజేతలుగా గెలుపొందారు. ప్రతి జిల్లా నుంచి నలుగురిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేసిన పంపాలనే ఆదేశాలతో మొదటి మూడు స్థానాల్లో ఉన్నవారితో పాటు నాలుగో స్థానంలో ఉన్న వారిని సైతం రాష్ట్రస్థాయి పోటీలకు పంపించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దానికి సంబంధించిన జాబితాను విడుదల చేసినట్లు స్వామి వెల్లడించారు.ఎంపికైన వారు ఈనెల 14 నుండి తెలంగాణ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాదులో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొంటారని తెలిపారు.