రైతుల్ని ద‌గా చేస్తున్న‌రు..

BRS:రైతుభ‌రోసా పేరిట రైతును రేవంత్ స‌ర్కారు ద‌గా చేస్తోంద‌ని బీఆర్ఎస్ నేత‌లు మండిప‌డ్డారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు ప‌ట్ట‌ణంలో ప్ర‌ధాన ర‌హ‌దారిపై న‌ల్ల కండువాలు వేసుకుని నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ప‌లువురు నేత‌లు మాట్లాడుతూ రైతుల‌కు ప్ర‌తి ఏటా రూ.15 వేలు రైతు భరోసా ఇస్తామని ఏడాది పాటు ఊరించి చివరికి 12 వేలే ఇస్తామన‌డం ఎంత వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని ప్ర‌శ్నించారు. మాయ మాటలు చెప్పి రైతుల‌ ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చాక మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ నేతలు రాహుల్, రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు అంద‌రూ రైతుల‌కు క్షమాపణలు చెప్పాలన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు ఎకరానికి 15000 చొప్పున రైతు భరోసా అమలు చేసే వరకు తెలంగాణ రైతుల‌ పక్షాన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే ఉంటామ‌ని హెచ్చరించారు.

ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి రైతుల‌ను మోసం చేస్తున్నాడంటూ రైతులతో కలిసి కాంగ్రెస్ హామీ పత్రాలను, రేవంత్ ఫ్లెక్సీని దహనం చేసి నిరసన తెలిపారు. కార్యక్రమంలో చెన్నూరు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

You might also like