కోట‌ప‌ల్లిలో కోడిపందాలు

Cock racing in Kotapalli: కోట‌ప‌ల్లిలో కోడిపందాలు నిర్వ‌హిస్తున్న స్థావ‌రంపై పోలీసులు దాడి చేసి ప‌ట్టుకున్నారు. కోటపల్లి మండలం నాగంపేట బొప్పరం గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో కోడిపందేలు నిర్వహిస్తున్నారని స‌మాచారం రావ‌డంతో పోలీసులు దాడులు చేశారు. ఎస్సై రాజేందర్ ఆధ్వర్యంలో సిబ్బందితో క‌లిసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. 10 కోళ్ళు , 7 మొబైళ్లు, రూ. 59.78 వేల‌ నగదు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 4 బైక్‌లు సీజ్ చేశారు. పోలీసుల రాకను గమనించిన పందేం రాయుళ్లు తమ వాహనాలను అక్కడే వదిలేసి పారిపోయే ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు వెంబ‌డించి ప‌ట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేందర్ తెలిపారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో జనగామ మల్లయ్య, పొట్టల రాజేందర్, సునాట్కారి రాజేష్, దుర్గం రమేష్, చిప్పకూర్తి బాపు, వెంకట్, గాండ్ల రవి ఉన్నారు.

You might also like