పని ప్రదేశంలో ఇబ్బంది ఉంటే మా దృష్టికి తీసుకురండి
పని ప్రదేశంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తాండూరు ఎంపీడీవో శ్రీనివాస్ కూలీలకు సూచించారు. మండలంలోని మాదారంలో జరుగుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను ఆయన పరిశీలించారు. ముందుగా ఆయన ఉపాధి కూలీల మాస్టర్ షీట్ తనిఖీ చేశారు. ప్రభుత్వ కొలతల ప్రకారం ఉపాధి కూలీలు పనిచేసి గిట్టుబాటు వేతనాన్ని పొందాలని కోరారు. ఉపాధి కూలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొలతల ప్రకారం పని వివరాలను పక్కాగా రికార్డుల్లో నమోదు చేయాలన్నారు.