ఆయనకిద్దరు..
ఇద్దరు భామలను ఒకేసారి పెళ్లి చేసుకోవడం సినిమాల్లో చూసుంటాం. కానీ అలాంటి అరుదైన ఘటనలు నిజజీవితంలోనూ అప్పుడప్పడూ జరుగుతుంటాయ్. తాజాగా ఈ ఘటన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఓ యువకుడు ఒకే మండపంలో ఒకేసారి ఇద్దరి యువతులను పెళ్లి చేసుకున్నాడు. సూర్యదేవ్ అనే వ్యక్తి లాల్‌దేవి, జలకర్ దేవి అనే ఇద్దరిని ప్రేమించాడు. ప్రేమించిన ఆ ఇద్దరి యువతులకు విషయం చెప్పి, వారి సమ్మతితో ఇద్దర్ని పెండ్లి చేసుకున్నాడు. వారితో పాటు ముగ్గురు కుటుంబ సభ్యులు సైతం సమ్మతివ్వడంతో ఆ పెండ్లికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. అదే సమయంలో ఇద్దరికీ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటానని, బాండ్ పేపర్ రాసి ఇవ్వడంతో ఆ ముగ్గురు వివాహ బంధంతో ఏకమయ్యారు. జిల్లాలోని లింగాపూర్ మండలం గుమ్నూర్ లో వివాహ వేడుక జరిగింది. ఈ పెండ్లికి మూడు గ్రామాల ప్రజలతో పాఉట, వరుడు,ఇద్దరు వధువుల తరుపు పెద్దలు హాజరయ్యారు.