మంచినీటి గోస.. ప‌ట్టించుకోరంట‌…

మాదారం టౌన్‌షిప్‌లో నీళ్ల కోసం న‌ర‌య‌యాత‌న‌
త‌ర‌చూ కాలిపోతున్న సింగ‌రేణి మోటార్లు
నీటి స‌మ‌స్య ప‌రిష్క‌రిస్తామ‌ని ఎమ్మెల్యేకు హామీ ఇచ్చిన జీఎం
ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ట్టించుకోని అధికారులు
కాన‌రాని నేత‌లు, యూనియ‌న్ నాయ‌కులు

Madaram Town Ship: ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు క‌ల‌గ‌కుండా చూస్తాం… నీటి కొర‌త లేకుండా చూస్తాం… ఇదీ బెల్లంప‌ల్లి ఎమ్మెల్యే గ‌డ్డం వినోద్‌కు సింగ‌రేణి జీఎం ఇచ్చిన హామీ.. అది కూడా రాజ‌కీయ హామీ లాగానే మిగిలిపోయింది… ప్ర‌జ‌ల నీటి క‌ష్టాలు మాత్రం తీర‌డం లేదు… ఈ వ్య‌వ‌హారంలో ప్ర‌జ‌ల గురించి ప‌ట్టించుకోవాల్సిన నాయ‌కులు, యూనియ‌న్ నేత‌లు ఏ మాత్రం దృష్టి సారించ‌డం లేద‌ని ప‌లువురు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

మంచిర్యాల జిల్లా తాండూరు మండ‌లం మాదారం టౌన్షిప్‌లో కొద్ది నెల‌లుగా మంచినీటీ స‌మ‌స్య తీవ్ర‌త‌రం అవుతోంది. సింగ‌రేణి స‌ర‌ఫ‌రా చేస్తున్న నీటి విష‌యంలో నిర్ల‌క్ష్యం కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తోంది. మోటార్లు త‌ర‌చూ కాలిపోతుండ‌టంతో ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు. దీంతో నిత్యం బోర్ పంపుల వ‌ద్ద జ‌నం క్యూలు క‌డుతున్నారు. ఇప్ప‌టికే నాలుగైదు సార్లు మోటార్లు కాలిపోయాయి. ఈ నేప‌థ్యంలో సింగ‌రేణి అధికారులు సైతం త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. కొత్త మోటార్లు తెప్పించాల్సిన స్థానంలో పాత వాటినే న‌డిపిస్తున్నార‌ని అందుకే కాలిపోయ‌తున్నాయని చెబుతున్నారు.

ఎమ్మెల్యేకు ఇచ్చిన హామీ సైతం ప‌ట్టించుకోలే..
కొద్ది రోజుల కింద‌ట స్థానిక నాయ‌కులు ఎమ్మెల్యే దృష్టికి మాదారం టౌన్‌షిప్ నీటి స‌మ‌స్య తీసుకువెళ్లారు. దీంతో ఆయ‌న బెల్లంప‌ల్లి ఏరియా జీఎంతో మాట్లాడారు. దీంతో నీటి స‌మ‌స్య ఈ నెల 10వ తేదీ వ‌ర‌కు ప‌రిష్క‌రిస్తామ‌ని హామీ ఇచ్చారు. ఈ నెల 10వ తేదీనే మోటారు కాలిపోవ‌డం గ‌మ‌నార్హం. ఎమ్మెల్యే గ‌డ్డం వినోద్ సైతం ఈ వ్య‌వ‌హారం మ‌రిచిపోయారు. దీంతో మాదారం టౌన్షిప్ వాసుల‌కు క‌ష్టాలు త‌ప్ప‌డం లేదు. మూసివేసిన ఎంవీకే 1 గ‌ని నుంచి మాదారం టౌన్షిప్‌కు మంచినీటి స‌ర‌ఫ‌రా సాగుతోంది. త‌ర‌చూ పైపులు ప‌గులుతుండ‌టంతో మోటారుపై ఒత్తిడి పెరిగి అది కాలిపోతున్న‌ట్లు చెబుతున్నారు.

కాన‌రాని నేత‌లు, యూనియ‌న్ నాయ‌కులు
అయితే, ఇంత జ‌రుగుతున్నా అధికార పార్టీ నాయ‌కులు, యూనియ‌న్ నేత‌లు ఏ మాత్రం ప‌ట్టించుకోక‌పోవ‌డం ప‌ట్ల ప‌లువురు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. కేవ‌లం ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లిన నేత‌లు ఆ త‌ర్వాత అధికారుల‌తో మాట్లాడి స‌మ‌స్య పూర్తిగా ప‌రిష్క‌రించాల్సి ఉండ‌గా ఏమీ ప‌ట్ట‌నట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని దుయ్య‌బ‌డుతున్నారు. అదే స‌మ‌యంలో సింగ‌రేణిలో ప‌ట్టున్న యూనియ‌న్ నేత‌లు సైతం మాదారం టౌన్షిప్ గురించి ప‌ట్టించుకోక‌పోవ‌డం ఏమిట‌నే ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. పాత మోటార్లు తెస్తే తిరిగి అదే ప‌రిస్తితి త‌లెత్తుతుంద‌ని ఇప్ప‌టికైనా కొత్త మోటార్లు తెప్పిస్తే త‌ప్ప స‌మ‌స్య ప‌రిష్కారం కాద‌ని ప‌లువురు స్ప‌ష్టం చేస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like