సింగ‌రేణిలో ఆ యంత్రం పేరు సింధూర్

Singareni: ఆప‌రేష‌న్ సింధూర్‌.. ఏ నోట విన్నా… ఎక్క‌డ చూసినా అదే మాట‌. అంద‌రిదీ అదే బాట‌. కొంద‌రు త‌మ పిల్ల‌ల‌కు సింధూర్‌, సింధూర అని పేర్లు పెట్టుకోగా, కొన్ని చోట్ల హోట‌ళ్ల‌కు ఇండ్ల‌కు ఆ పేర్లు పెట్టుకుంటున్నారు. అయితే, సింగ‌రేణిలోని బెల్లంప‌ల్లి ఏరియాలో కొత్త‌గా ప్రారంభించిన ఓ షావెల్ యంత్రానికి సింధూర్ అనే పేరు పెట్టారు.

బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ విజయ భాస్కర్ రెడ్డి ( Vijayabhaskar Reddy) సూచించారు. బెల్లంపల్లి ఏరియాలోని కైరిగూడ ఓపెన్ కాస్ట్‌లో గురువారం నూతన షావెల్ యంత్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌ (Operation Sindoor) పేరు నూతన షావల్ యంత్రానికి పెట్టామని వివరించారు. అధికారులు, ఉద్యోగులు ఎప్పటికప్పుడు యంత్రాల పనితీరు పర్యవేక్షిస్తూ ఉండాలని సూచించారు. ఉద్యోగులందరూ సింగరేణి సంస్థ యంత్రాలు వాహనాలను స్వంత వాహనాల మాదిరిగా చూసుకోవాలని కోరారు.

బెల్లంపల్లి ఏరియాకు నిర్దేశించిన వార్షిక బొగ్గు ఉత్పత్తిని సమష్టి కృషితో అధిగమించాలని ఈ సంద‌ర్బంగా అందరికీ తెలిపారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ గోలేటి బ్రాంచ్ కార్యదర్శి ఎస్ తిరుపతి, పీవో మచ్చగిరి నరేందర్ , ఏరియా ఎస్‌వో టూ జీఎం రాజమల్లు, ఏరియా ఇంజినీర్ రామనాథం , ఏరియా సెక్యూరిటీ అధికారి ఉమాకాంత్ ,ప్రాజెక్టు ఇంజనీర్ వీరన్న, గని మేనేజర్ శంకర్‌తోపాటు పలువురు పాల్గొన్నారు.

You might also like