చీనాబ్ రైల్వే బ్రిడ్జి జాతికి అంకితం చేసిన మోదీ
Modi: ప్రపంచలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి అయిన చీనాబ్ రైల్వే బ్రిడ్జిని మోదీ జాతికి అంకితం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన (worlds highest rail bridge) ఈ చీనాబ్ బ్రిడ్జ్ కావడం గమనార్హం. ఈ సందర్భంగా జమ్మూ కాశ్మీర్‌లో రూ.46,000 కోట్లకు పైగా విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు సైతం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం కత్రా నుండి శ్రీనగర్ వరకు వందే భారత్ రైలు సర్వీసు ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఆ తర్వాత
చీనాబ్ విశేషాలు..
చీనాబ్ రైలు వంతెన భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఉక్కు, కాంక్రీట్‌తో నిర్మించిన ఈ వంతెన జమ్మూ కశ్మీర్‌లోని జమ్మూ డివిజన్ రియాసి జిల్లా బక్కల్ – కౌరీ మధ్య ఉంది. కశ్మీర్‌ను భారత్‌లోని మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు ఉధంపుర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టులో భాగంగా చీనాబ్ వంతెనను నిర్మించారు. నదీ గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తున చీనాబ్ నదిపై 1,315 మీడర్ల పొడవైన వంతెనను నిర్మించారు. చైనాలోని బెయిసాన్ నదిపై నిర్మించిన 275 మీటర్ల పొడవైన షుబాయ్ రైల్వే వంతెన పేరుపై ఉన్న ప్రపంచ రికార్డును ఇది అధిగమించింది. పారిస్‌లోని ఐఫిల్ టవర్ కంటే కూడా దీని ఎత్తు 30 మీటర్లు ఎక్కువ. 2003లో వాజ్‌పేయి ప్రభుత్వం వంతెన నిర్మాణానికి ఆమోదం తెలుపగా పూర్తి కావడానికి 22 ఏండ్లు పట్టింది.
ఈ ప్రాజెక్టు విశేషాలు ఇవే..
ఈ ప్రాజెక్ట్ ద్వారా కశ్మీర్ లోయకు దేశంలోని మిగిలిన ప్రాంతాలకు రైల్వే అనుసంధానం ఏర్పడింది.
భూకంపాలు, గంటకు 260 కిలోమీటర్ల వేగంతో వీచే బలమైన గాలుల్ని తట్టుకోగల ఈ వంతెన జీవితకాలం 120 ఏండ్లు. ఆర్చ్ ఆకృతిలో నిర్మించిన ఈ రైల్వే వంతెన పొడవు 1,315 మీటర్లు. ఈఫిల్ టవర్ కన్నా ఎత్తు ఎక్కువ. నదీగర్భం నుంచి ఈ బ్రిడ్జి 1,178 అడుగుల ఎత్తులో ఉంది. వంతెన నిర్మాణం కోసం 28 వేల టన్నుల స్టీల్, 6 లక్షల బోల్ట్‌లు వాడారట. నిర్మాణ వ్యయం రూ.1483 కోట్లు.