పోలీస్‌స్టేష‌న్‌లో రాఖీ పండ‌గ

Rakhi festival at the police station: తాండూరు స‌ర్కిల్ కార్యాల‌యంలో రాఖీ పండుగ నిర్వ‌హించారు. రాఖీ పండుగ పుర‌స్క‌రించుకుని తాండూరు సర్కిల్ కార్యాల‌యంలో మాదారం,తాండూరు పోలీస్ సిబ్బంది, మ‌హిళా అధికారులు క‌లిసి రాఖీ పండుగ జ‌రుపుకున్నారు. ఈ సంద‌ర్భంగా వారు రాఖీలు క‌ట్టి శుభాకాంక్ష‌లు తెలిపారు. తాండూరు సీఐ దేవ‌య్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సోదరభావంతో మెదలాలనే సందేశాన్ని తెలియజేయడమే రాఖీ పండ‌గ ఉద్దేశ్యమన్నారు. సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమైన మన దేశంలో ప్రతి పండుగకు ఒక విశిష్ట‌త ఉంటుంద‌న్నారు. కార్య‌క్ర‌మంలో తాండూరు ఎస్ఐ కిర‌ణ్ కుమార్‌, మాదారం ఎస్ఐ సౌజ‌న్య‌, పోలీసులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like