వరదలో చిక్కుకున్న యువకులు..
Youths trapped in the flood: చేపలు పట్టేందుకు వెళ్లిన నలుగురు యువకులు వాగులో చిక్కుకుపోగా, స్థానికులు తాళ్ల సాయంతో కాపాడారు. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో వాగు అవతల చిక్కుకుపోయిన నలుగురు యువకులు స్థానికులు కాపాడారు. కాసిపేట మండలం బుగ్గచెరువు వద్ద చేపలు కోసం నలుగురు యువకులు వాగుదాటి అవతలి ఒడ్డకు వెళ్లారు. భారీ వర్షాల కారణంగా హఠాత్తుగా వాగు పెద్దఎత్తున పొంగిపొర్లింది. దీంతో దిక్కుతోచని పరిస్థితుల్లో సాయం కోసం ఆర్తనాదాలు చేశారు. దీనిని గమనించిన స్థానికులు తాళ్ల సాయంతో ఆ నలుగురిని కాపాడారు. అధిక వర్షాల కారణంగా ప్రజలు బయటకు వెళ్లొద్దని ముఖ్యంగా వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు