ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవ వేడుకలు
ప్రపంచ ఫోటో గ్రఫీ సందర్భంగా కాగజ్‌నగర్ ఫోటో వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆద్వర్యంలో పట్టణంలో యూనియన్ సభ్యులు రాజీవ్‌గాంధీ చౌరస్తా నుండి మార్కెట్ .అంబేద్కర్ చౌరస్తా మీదుగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఫంక్షన్ హాలో ఫోటో గ్రాఫర్స్ ఫీతమాహూడు లూయిస్ మండె డాగ్యురె చిత్రపటానికి పులమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం యూనియన్ సభ్యులు కేక్ కటింగ్ చేసి సంబరాలు జరుపు కున్నారు. కార్యక్రమంలో కాగజ్‌నగర్ ఫోటో వీడియో గ్రాఫీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు