ఎమ్మెల్యే పీఏలు.. మందు తాగి చిందులు..

వారిద్దరూ ఓ ఎమ్మెల్యేకి PA లు.. బాధ్యతాయుతంగా ఉండాల్సిన వాళ్ళు.. తప్ప తాగి రోడ్డు పైన చిందులు వేశారు. వారికి కాంగ్రెస్ నేతలు సైతం తోడయ్యారు. ఇంకేముంది… రచ్చ రచ్చ చేశారు.

తమది అధికార పార్టీ.. పైగా ఎమ్మెల్యే అనుచరులు.. ఇంకేముంది.. రోడ్డు పై నానా హంగామా చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కెమికల్ ఏరియాలో జాతీయ రహదారి పై హంగామా సృష్టించారు. బహిరంగ ప్రదేశం లో మద్యం సేవిస్తూ నడి రోడ్డు పైన డాన్స్ లు, కేరింతల్లో హడావిడి చేశారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన దీనికి సంబంధించిన వీడియోవైరల్ గా మారింది. వీడియోలో ఓ ఎమ్మెల్యే ప్రైవేట్, అఫిషియల్ పీఏ లు హంగామా చేయడం కనిపించింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు పీ ఏ లు రహదారి పై మద్యం సేవించడం పై తీవ్ర చర్చ సాగుతోంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like