ప్రపంచంలోనే అత్యంత సన్నని 5G స్మార్ట్‌ఫోన్‌…

Slimmest Smartphone :భారత్‌ మార్కెట్‌ లో చాలా కంపెనీలు స్లిమ్‌, అల్ట్రా స్లిమ్‌ డిజైన్‌ తో అందుబాటులోకి తెస్తున్నాయి. భారీ బ్యాటరీలు కలిగి ఉన్న మోడల్స్‌ కూడా స్లిమ్ డిజైన్ తో వ‌స్తున్నాయి. అయితే తాజాగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ టెక్నో ప్రపంచంలోనే స్లిమ్‌ 5G కర్వడ్ ఫోన్‌ ను తీసుకురానున్నట్లు ప్రకటన చేసింది. ఈ ఫోన్‌కు సంబంధించిన కీలక వివరాలను కూడా వెల్లడించింది.

టెక్నో సంస్థ‌ ఈ స్లిమ్‌ కర్వడ్‌ 5G ఫోన్‌ను సెప్టెంబర్‌ లో ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్‌ కు సంబంచిన ఎటువంటి స్పెసిఫికేషన్‌ లు, ఫీచర్ల వివరాలను స్లిమ్‌ డిజైన్‌, మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌ సహా..! టెక్నో వెల్లడించలేదు. అయితే ఈ సంవత్సరం జరిగిన మొబైల్‌ వరల్డ్ కాంగ్రెస్ 2025 (MWC) టెక్నో స్పార్క్‌ స్లిమ్ మోడల్‌ ను ప్రదర్శించింది. ఈ ఫోన్ డిజైన్‌ అందరికీ ఆకట్టుకుంది. అచ్చంగా ఇదే డిజైన్‌ పోలి ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఫోన్ కేవలం 5.75mm థిక్‌నెస్‌ ను మాత్రమే కలిగి ఉంది. ఇటీవల అందుబాటులోకి వచ్చిన శాంసంగ్‌ గెలాక్సీ S25 ఎడ్జ్‌ మోడల్‌ కంటే టెక్నో మోడల్ మరింత సన్నని డిజైన్ కలిగి ఉంటుందని తెలుస్తోంది. అది ఏ పేరుతో లాంచ్‌ కానుందనే వివరాలను సైతం సంస్థ వెల్లడించలేదు. ప్రపంచంలోనే అత్యంత సన్నని 5G మోడల్‌ గా నిలుస్తుందని చెబుతున్నారు.

స్పెసిఫికేషన్లు వివరాలను వెల్లడించకపోయినా ఫ్లాగ్‌షిప్‌ సెగ్మెంట్‌లో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. హైఎండ్‌ చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 16 ఆధారిత OS పైన పనిచేస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.80 వేలుగా ఉంటుందని స‌మ‌చారం. ప్రస్తుతం ఉన్న అంచనా వివరాల ఆధారంగా 6000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు చేస్తుందని చెబుతున్నారు. క్వాడ్‌ కర్వడ్‌ స్క్రీన్‌ ను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ మోడల్‌ డిస్‌ప్లే 6.3 అంగుళాల నుంచి 6.5 అంగుళాల వరకు ఉంటుంది.

టెక్నో AI గ్లాసెస్, AI గ్లాసెస్ ప్రో అనేవి ఒక జత కళ్లజోడు పోలి ఉండి సమ్మరైజింగ్, నోట్స్ ట్రాన్సలేటింగ్, లేదా వస్తువులను గుర్తించడం వంటి అనేక AI ఫీచర్ల సపోర్ట్​ను అందిస్తాయని కంపెనీ చెబుతోంది. ఈ రెండింటిలో ప్రో మోడల్ బిల్డ్-ఇన్ కెమెరా ఉంటుంది. దీంతోపాటు ఇందులో AR డిస్​ప్లే కూడా ఉంది. ఇది వినియోగదారులు నావిగేషన్ ఇన్​స్ట్రక్షన్స్ లైవ్ వ్యూను చూచేందుకు ఉపయోగపడుతుంది. అంతేకాక కంపెనీ వీటిలో టెక్నో ఎల్లాను అమర్చింది. ఇది ఒక వాయిస్ అసిస్టెంట్​. టెక్నో స్పార్క్ స్లిమ్ మాదిరిగానే కంపెనీ బార్సిలోనాలో జరిగే MWC 2025లో ఈ AI గ్లాసెస్, AI గ్లాసెస్ ప్రోను ప్రదర్శించనుంది.

మొబైల్ వరల్డ్‌ కాంగ్రెస్‌ 2025 లో టెక్నో ఆవిష్కరించిన కాన్సెప్ట్‌ మోడల్‌ కేవలం 5.75mm థిక్‌నెస్‌ ను మాత్రమే కలిగి ఉంది. ఈ ఫోన్ 144Hz రీఫ్రెష్‌ రేట్‌, 4500 నిట్స్ పీక్‌ బ్రైట్‌నెస్‌ తో 6.78 అంగుళాల కర్వడ్‌ ఎడ్జ్‌ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ టెక్నో ఫోన్ 5200mAh బ్యాటరీని కలిగి ఉంది. కెమెరా విభాగం పరంగా 50MP + 50MP కెమెరాలను కలిగి ఉంది. మరియు 13MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. టెక్నో కొత్త ఫోన్ వివరాలు త్వరలో విడుదల అయ్యే అవకాశం ఉంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like