కార్మిక పోరాట సభకు రండి

BMS:భూపాల‌ప‌ల్లిలో సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్(BMS) ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించే “కార్మిక పోరాట బహిరంగ” సభకు రావాల‌ని బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ కు బీఎంఎస్ ప్ర‌తినిధులు ఆహ్వానం ప‌లికారు. భూపాల‌ప‌ల్లిలో సెప్టెంబ‌ర్ 3న ఈ స‌భ నిర్వ‌హించారు. ఈ మేర‌కు SCMKS – BMS అధ్య‌క్షుడు యాదగిరి సత్తయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ అప్పాని శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి యతిపతి సారంగపాణి ఈట‌ల రాజేంద‌ర్‌ను క‌లిసి ఆహ్వానం అందించారు. ఈ సంద‌ర్భంగా వారు మ‌ట్లాడుతూ సింగరేణి పరిశ్రమ పరిరక్షణకు, కార్మిక హక్కుల సంరక్షణక కోసం దేశవ్యాప్త ఆందోళన కార్యక్రమాలలో ఈ బ‌హిరంగ స‌భ నిర్వ‌హిస్తున్నామ‌న్నారు. సింగరేణి పరిశ్రమ ప్రగతి, నూతన బొగ్గు గనుల ఏర్పాటు, కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత కల్పించడానికి బీఎంఎస్ కృషి చేస్తుందని వెల్ల‌డించారు.

ప్రభుత్వాలు, సింగరేణి యాజమాన్యం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను మార్పు చేసే విధంగా కృషి చేస్తామన్నారు. దేశ వ్యాప్తంగా బొగ్గు పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలను అధికమించాడానికి SCMKS BMS తగు కార్యాచరణలో భాగంగా భూపాలపల్లిలో భారీ కార్మిక పోరాట సభను ఏర్పాటు చేశామ‌న్నారు. ఈ సంద‌ర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ తో సింగరేణి సంస్థ పరిరక్షణ కార్మిక సమస్యలపై ప్రత్యేకంగా చర్చించారు. ఈ బ‌హిరంగ స‌భ‌కు ముఖ్య అతిథులుగా ఎంపీ ఈటల రాజేందర్, బీఎంఎస్‌ నాయకులు, బొగ్గు పరిశ్రమల ఇంచార్జ్ కొత్తకాపు లక్ష్మారెడ్డి హాజరు అవుతార‌ని వెల్ల‌డించారు. కార్య‌క్ర‌మంలో నాయకులు దుస్స భాస్కర్, బోడకుంట శ్రీధర్, చల్ల వేణు తదితరులు పాల్గొన్నారు

Get real time updates directly on you device, subscribe now.

You might also like