మంచిర్యాల రైల్వే స్టేషన్ లో భారీ వర్షం
అదేంటి… రైల్వే స్టేషన్ లో భారీ వర్షం అనుకుంటున్నారా…? నిజమే మంచిర్యాల రైల్వే స్టేషన్ లో భారీ వర్షం పడింది. ఇంతకీ విషయం ఏమిటంటే… బుధవారం మధ్యాహ్నం మంచిర్యాలలో భారీ వర్షం పడింది. అదే సమయంలో రైల్వే స్టేషన్ లో రెండో ఫ్లాట్ఫారం దగ్గర ప్రయాణికులు రైలు కోసం వేచి చూస్తూన్నారు. ఇంతలో రెండు మూడు చోట్ల ప్రయాణీకులు కూర్చున్న ప్రాంతంలో పై నుండి పెద్ద ఎత్తున నీళ్లు ప్రయాణికులపై పడ్డాయి. రేకుల నుంచి ఒకేసారి నీళ్లు పడటంతో కొందరు ప్రయాణికులు తడిచి పోయారు. మరి కొందరి సామగ్రి సైతం తడిచింది.