ముంపు భయంతో ముందస్తు తరలింపు
Mata Shishu Rakshakan Kendra:మాతా శిశు సంరక్షణా కేంద్రం నుంచి ముందస్తుగా గురువారం గర్భిణులు, బాలింతలను తరలించారు. ఈ కేంద్రం నుంచి జిల్లాకేంద్రంలోనీ పలు ఆస్పత్రులకు తరలించారు. గోదావరి వరద ఉదృతి పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మంచిర్యాల గోదావరి ఒడ్డునే ఈ కేంద్రం ఏర్పాటు చేశారు. మంచిర్యాల పట్టణానికి ఎగువనే ఎల్లంపల్లి ప్రాజెక్టు ఉంటుంది. వరద పెరిగితే కచ్చితంగా మాతా శిశు సంరక్షణా కేంద్రాన్ని ముంచెత్తుతుంది. దీంతో మాత శిశు ఆసుపత్రిలో ఉన్న వారిని స్వచ్ఛందంగా మంచిర్యాల జిల్లా ఆసుపత్రికి తరలించారు.
ఎల్లంపల్లి ప్రాజెక్టు 48 గేట్లు ఎత్తిన అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. పై నుంచి వరద ప్రవాహం మరింతగా పెరిగే అవకాశం ఉన్న నేపధ్యంలో గర్భిణీలు, బాలింతలను తరలించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తిన ప్రతీసారి వరద ప్రవాహం పెరిగి నేరుగా ఈ కేంద్రంలోకి చేరుతోంది. వరదఉధృతి మరింత పెరిగితే ఎల్లంపల్లి గేట్లు పూర్తిస్థాయిలో ఎత్తేస్తే, ఈ భవనం నీట మునిగే ప్రమాదం ఉంది.