వేదాంత – మీనాక్షి పవర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ప్రారంభం
Vedanta’s Meenakshi Energy fully operational with 1000 MW capacity: దేశంలోనే ప్రసిద్ది చెందిన పవర్ ప్రాజెక్టులలో ఒకటి వేదాంత లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన మీనాక్షి ఎనర్జీ లిమిటెడ్ (MEL) 1000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ను పూర్తిస్థాయిలో ప్రారంభం అయ్యింది. ఇందులో రెండు 350 మెగావాట్ల యూనిట్లు, రెండు 150 మెగావాట్ల యూనిట్లు ఉన్నాయి. ఇటీవల నాలుగో (350 మెగావాట్లు) విజయవంతంగా 72 గంటల ట్రయల్ పూర్తి చేసి, (Southern Regional Load Despatch Centre) SRLDC నుండి వాణిజ్య ధ్రువీకరణ కమర్షియల్ ఆపరేషన్ డేట్ (COD)ని పొందారు.
2023లో వేదాంత బాధ్యతలు స్వీకరించిన మీనాక్షి ఎనర్జీ లిమిటెడ్ రెండు సంవత్సరాల లోపే చరిత్రలో నిలిచే విధంగా పునరుద్ధరణ సాధించింది. ఈ ఏడాది రెండు 150 మెగావాట్ల యూనిట్లు, ఈ నెలలో రెండు 350 మెగావాట్ల యూనిట్లు ప్రారంభమవడంతో మొత్తం 1000 మెగావాట్ల సామర్థ్యంతో తీసుకు వచ్చింది. దీని ద్వారా పరిశ్రమలు, విద్యుత్ గ్రిడ్లకు నిరంతర విద్యుత్ సరఫరా జరగనుంది. “వేదాంత పవర్ ప్రాజెక్ట్” చరిత్రలో ఒక మైలు రాయి లా నిలిచే విధంగా ఈ నిర్మాణం చేపట్టారు. వేదాంత పవర్ “CEO రాజిందర్ సింగ్ అహుజా మాట్లాడుతూ “భారతదేశ విద్యుత్ ఉత్పత్తిలో థర్మల్ ప్రాజెక్టులు 70 శాతం కంటే ఎక్కువ భాగం ఉన్నాయని. అవే శక్తి భద్రతకు వెన్నెముక అని స్పష్టం చేశారు. మీనాక్షి ఎనర్జీ విజయవంతమైన, దేశ అవసరాలను తీర్చడంలో మా కట్టుబాటు మరింత బలపడింద”న్నారు.
“మీనాక్షి ఎనర్జీ లిమిటెడ్” ప్రత్యేకతలు:
– 100% ఉప్పునీటి ఆధారిత వినియోగం – తాజా నీటి వనరుల సంరక్షణ
– బూడిద నిల్వల నుండి నీరు తిరిగి వినియోగం
– పర్యావరణ పరిరక్షణ చర్యలు, వ్యర్థాల తొలగింపు
– 1150 మంది సిబ్బందికి ఆధునిక డిజిటల్ భద్రతా వ్యవస్థ
వేదాంత పవర్ పరిధి: భారతదేశంలో అతిపెద్ద ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తిదారుల్లో ఒకటైన వేదాంత పవర్, 4,780 మెగావాట్ల సామర్థ్యంతో పంజాబ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలలో విద్యుత్ ప్లాంట్లను నిర్వహిస్తోంది.మినాక్షి ఎనర్జీ (తమ్మినపట్నం, తిరుపతి జిల్లా) – 1000 మెగావాట్ల థర్మల్ ప్లాంట్, సురక్షితమైన, నమ్మకమైన పర్యావరణ స్నేహపూర్వక విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి సారిస్తోంది.