దేవాపూర్ సిమెంట్ కంపెనీ ఎన్నికల్లో సత్యపాల్ విజయం
Satyapal wins Devapur Cement Company electionsL దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీ ఎన్నికల్లో కొక్కిరాల సత్య పాల్ విజయం సాధించారు. ఉత్కంఠభరితంగా సాగిన ఎన్నికల్లో ఆయన తన ప్రత్యర్థి విక్రం రావుపై 33ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సత్యపాల్ రావుకు 141 ఓట్లు రాగా, విక్రం రావుకు 108 ఓట్లు వచ్చాయి. సత్యపాల్‌ను మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్ రావు బలపరచగా, పూస్కూరి విక్రమ్ రావుకు మంత్రి వివేక్, ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, వెడ్మ బొజ్జు మద్దతు పలికారు.
ఈ ఎన్నికలు చిన్నవే అయినా మంత్రి వివేక్ అనుచరుడు పూస్కురి విక్రమ్ రావు, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావు తమ్ముడు కొక్కిరాల సత్యపాల్ రావు ఇద్దరు పోటీ పడటం ఎన్నికల్లో వేడి రాజేసింది. విక్రమ్ రావుకు మంత్రి వివేక్, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు, పెద్దపల్లి ఎంపీ మద్దతు చెప్పారు. కేవలం ఒక్క సిమెంట్ ఫ్యాక్టరీకి చెందిన ఎన్నికలు ఎమ్మెల్యే ఎన్నికలను తలపించాయి. రెండు వర్గాలు భారీగా ఖర్చు చేయగా, చివరకు ఓటర్లను క్యాంపులకు సైతం తరలించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.