శభాష్… దుర్గాభవాని..
వర్షాలు, వరదలో జన జీవనం స్తంభించిపోతోంది. మరీ ముఖ్యంగా ఈ వరదల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంటలు నీట మునగడంతో కన్నీటి పర్యంతం అవుతున్నారు. దీంతో వరద నష్టం అంచనా వేసేందుకు ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో పంట నష్టం పై అధికారులు సర్వే చేస్తున్నారు. దీనిలో భాగంగా కాగజ్‌నగర్ మండలం సారసాల గ్రామానికి చెందిన రైతుల భూములు పెద్దవాగు పరీవాహక ప్రాంతంలో వరద ముంపులో ఉండిపోయాయి. అక్కడికి వెళ్లేందుకు ఖచ్చితంగా ఓ వాగు దాటాల్సి ఉంటుంది. రాస్పెల్లి క్లస్టర్ ఏఈవో దుర్గాభవాని నడుము లోతు నీళ్లలో ఆ వాగు దాటుకుని వెళ్లి రైతుల ముంపు భూములపై సర్వే చేశారు. ఆమె చూపిన ధైర్యానికి పలువురు అభినందిస్తున్నారు.