భ‌ర్త‌ను హ‌త్య చేసేందుకు భార్య ప్లాన్‌

Wife’s plan to kill husband:వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని.. కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి భార్య హత్య చేసేందుకు ప‌క‌డ్బందీ ప్లాన్ చేసింది. అయితే, భ‌ర్త చావు బ‌తుకుల మ‌ధ్య ఉండ‌టంతో అనుకున్న ప్లాన్ కాస్తా రివ‌ర్స్ అయ్యింది. ఈ ఘటన ఆదిలాబాద్‌ జిల్లాలో జరిగింది. వివ‌రాల్లోకి వెళితే…

ఆదిలాబాద్ జిల్లాలోని మావ‌ల పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని రాణి (పేరు మార్చాం) అనే మ‌హిళ ఓ యువ‌కుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. దీంతో త‌న భర్త‌ను అడ్డు తొల‌గించుకోవాల‌ని ప‌థ‌కం ప‌న్నింది. ప్రియుడితో క‌లిసి భర్తను చంపేందుకు స్కెచ్ వేసింది. భ‌ర్త‌ను చంపేందుకు ర‌క‌ర‌కాలుగా ఆలోచించిన ఆమెకు ఓ ఐడియా త‌ట్టింది. ప్రియుడితో క‌లిసి భ‌ర్త‌కు బ‌ల‌వంతంగా మ‌ద్యం తాగించి అందులో విషం క‌లిపి హ‌త్య‌కు ప్లాన్ చేశారు. అనుకున్న‌ట్లుగానే భ‌ర్త‌కు మందులో విషం క‌లిపి తాగించారు..

అయితే, వారు అనుకున్న పాచిక పార‌లేదు. భ‌ర్త చావుబ‌తుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. విష‌యం బ‌య‌ట‌కు పొక్క‌డంతో పోలీసులు రాణిని ఆమె ప్రియుడ్ని అరెస్టు చేశారు. అయితే, నేరం ఎక్కడ తమ మీదకు వస్తుందో అని హార్పిక్ తాగినట్టు భార్య, ఆమె ప్రియుడు డ్రామా ఆడారు. పోలీసులు రాణిని ఆమె ప్రియుడ్ని అరెస్టు చేసి క‌టాక‌టాల వెన‌క్కి పంపారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like