శ్రీ చైతన స్కూల్ యాజమాన్యంపై చ‌ర్య‌లు తీసుకోండి

జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేసిన INTUC నేత రంజిత్

శ్రీ చైతన్య స్కూల్ (మందమర్రి) య‌జ‌మాన్యం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని దీంతో విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రుల‌తో పాటు ఉపాధ్యాయులు సైతం ఇబ్బందుల‌కు గుర‌వుతున్నార‌ని మందమర్రి ఐఎన్టీయూ సీ పట్టణ అధ్యక్షుడు వడ్లకొండ రంజిత్ గౌడ్ క‌లెక్ట‌ర్‌ను కోరారు. ఈ మేర‌కు ఆయ‌న ప్ర‌జావాణిలో ఫిర్యాదు సైతం చేశారు. వర్షపు నీటితో వారంతా అవ‌స్థ‌లు ప‌డుతున్నార‌ని తెలిపారు. వర్షం వస్తే చాలు పాఠ‌శాల‌లో వర్షపు నీరు ఆగి బురదగా మారి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. పాఠ‌శాల‌లో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేద‌ని తెలిపారు. విద్యార్థుల తల్లితండ్రులు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా పాఠ‌శాల యాజ‌మాన్యం ప‌ట్టించుకోవ‌డం లేద‌న్నారు.

అంతేకాకుండా కొన్ని క్లాస్ రూముల్లో పిల్లలకు సరైన వెలుతురు లేకుండా పాఠాలు బోధిస్తున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశార‌. మరోసారి పిల్లలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు న్యాయం చేయాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like