అదనంగా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వండి..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన గిరిజన ఎమ్మెల్యేలు
Tribal MLAs meet Chief Minister Revanth Reddy: ఎస్టీ నియోజకవర్గాలలో అదనపు ఇందిరమ్మ ఇళ్ళు కేటాయించాలని ముఖ్యమంత్రిని గిరిజన ఎమ్మెల్యేలు కోరారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిలో మొదటి ప్రాధాన్యత కల్పించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన వారు గిరిజన జనాభా అధికంగా నివసంచే ఎస్టీ నియోజకవర్గాలలో అదనపు ఇందిరమ్మ ఇళ్ళు కేటాయించాలన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వంలో మొదటి ప్రాధాన్యత కల్పించాలని కోరుతూ సీఎంకు వినతి పత్రం అందచేశారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలు కోరం కనకయ్య (ఇల్లందు), వెంకటేశ్వర్లు (పినపాక), తెల్ల వెంకటరావు (భద్రాచలం), వెడ్మ బొజ్జు (ఖానాపూర్) తదితరులు ఉన్నారు.