అప్పటి నుంచే కుట్రలు మొదలయ్యాయి…
Kalvakuntla Kavitha Press Meet : రేవంత్‌రెడ్డి, హరీష్‌రావు ఒక్క ఫ్లైట్‌లో ప్రయాణం చేసినప్పటి నుంచే కుట్రలు మొదలయ్యాయని తెలంగాణ జాగృతి అధినేత కల్వకుంట్ల కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన తరువాత తొలిసారి ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. నన్ను కుట్ర చేసి బయటకు పంపించారు… ఇదే ప్రమాదం రామన్నకు ఉంది… కేసీఆర్ కు సైతం ఉందని కవిత స్పష్టం చేశారు. కుట్రలో భాగంగా నన్ను పంపించారు. బీఆర్ఎస్ పార్టీని కొందరు వాళ్ల హస్తగతం చేసుకునేందుకు జరుగుతున్న కుట్రలో భాగంగానే ఇవాళ నన్ను తప్పించారని జరిగిందని కవిత ఆరోపించారు. హరీష్‌రావు, సంతోష్‌రావు ఇంట్ల బంగారం ఉంటే తెలంగాణ బంగారం అవుతుందా…? అని ప్రశ్నించారామే.. నా మీద కుట్ర జరుగుతోందని తెలంగాణ భవన్లో ప్రెస్‌మీట్ పెట్టి 103 రోజులు అయినా కేటీఆర్ ఎందుకు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం చెల్లెగా స్పందించకపోయినా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎందుకు మాట్లాడలేదన్నారు.
కేసీఆర్, కేటీఆర్, నేను.. మాది ఒక కుటుంబం. మాది రక్త సంబంధం. పదవులు పోతేనో.. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తోనో పోయేటువంటి బంధం మాది కాదని కవిత స్పష్టం చేశారు. కానీ, ఎవరైతే పార్టీలో ఉండి కేవలం డబ్బు సంపాదించుకోవాలనే ఆలోచనతో.. వ్యక్తిగత లబ్ధిపొందాలనే ఆలోచన కలిగిన వ్యక్తులకు కావాల్సింది మేము ముగ్గురం కలిగి ఉండకూడదని.. మా కుటుంబం విచ్ఛిన్నం అయితేనే వాళ్లకు అధికారం వస్తందని వారి ఆలోచన. దానిలో భాగంగానే మొదటి స్టెప్ పడింది. నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయించారు. ఈ సందర్భంగా నేను కేసీఆర్‌ను విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి మీ చుట్టూ ఏం జరుగుతుందో చూసుకోండి నాన్న అంటూ కవిత కోరారు.