రూ. 2.31 కోట్ల ల‌డ్డూ

Ganesh Laddu :వినాయ‌క చవితి ఉత్సవాల్లో ల‌డ్డూ వేలం అంటే భ‌క్తులు వేలంలో పాల్గొన‌డానికి ఎంతో ఉత్సాహం చూపుతారు. లడ్డూ వేలానికి (Ganesh Laddu) ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. గణనాథుని చేతిలో నవరాత్రులు పూజలు అందుకున్న ఆ మహా ప్రసాదాన్ని సొంతం చేసుకుంటే తమకు శుభం కలుగుతుందని, భోగభాగ్యాలు దక్కుతాయని భక్తులు భావిస్తారు. ముఖ్యంగా కొన్ని చోట్ల ల‌డ్డూకు భారీ డిమాండ్ ఉంటుంది.

వినాయ‌క చవితి ఉత్సవాల్లో లడ్డూ వేలానికి (Ganesh Laddu) ప్రత్యేక స్థానం ఉంటుంది. గణనాథుని చేతిలో నవరాత్రులు పూజలు అందుకున్న ఆ మహా ప్రసాదాన్ని సొంతం చేసుకుంటే తమకు శుభం కలుగుతుందని, భోగభాగ్యాలు దక్కుతాయని భక్తులు భావిస్తారు. దీంతో ఎంతైనా వెచ్చించి వేలంలో దక్కించుకోవడానికి సిద్ధపడుతారు. ఈ క్రమంలో హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌ బండ్లగూడ జాగీర్‌లోని కీర్తి రిచ్మండ్‌ విల్లాలో జరిగిన గణేశ్‌ లడ్డూ వేలం రికార్డు ధర పలికింది. శుక్రవారం రాత్రి జరిగిన లడ్డూ వేలంలో కీర్తి రిచ్మండ్‌ విల్లావాసులు రూ.2,31,95,000 పైగా చెల్లించి దక్కించుకున్నారు. గతేడాది ఇదే కమ్యూనిటీలో లడ్డూ రూ.1.87 కోట్లు పలికడం గమనార్హం. మరోవైపు రాయదుర్గం మైహోమ్ భుజాలో గణేష్ లడ్డు రూ.51,77,777 లక్షలు పలికింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like