నాటు పడవ బోల్తా… ఒకరి గల్లంతు..
మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. అన్నారం బ్యారేజ్ సుందరశాల వద్ద గోదావరినదిలో నాటుపడవ బోల్తా పడిన ఘటనలో ఒకరు గల్లంతయ్యారు. పొక్కూర్ లో నాటు పడవ తీసుకురావడానికి మహరాష్ట్ర సిరోంచ తాలుక మండలపూర్ కి చెందిన ఇద్దరు మత్స్యకారులు వెళ్లారు. గోదావరి ప్రవాహంలో నాటు పడవ తీసుకువస్తుండగా అన్నారం సరస్వతీ బ్యారేజ్ 11 వ గేట్ దగ్గర ప్రమాదం సంభవించింది. అయితే, ఒక్కసారిగా నాటుపడవ మునగడంతో ఇద్దరు మత్య్సకారులు గడ్డం వెంకటస్వామి, తూనిరి కిష్టస్వామి నదిలో పడిపోయారు. అందులో కిష్టస్వామి ఈతకొడుతూ సురక్షితంగా బయటకు వచ్చాడు. గడ్డం వెంకటేష్ (48) ప్రవాహంలో గల్లంతయ్యాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.