ఏటీఎం చోరీకి విఫ‌ల‌యత్నం

Failed ATM robbery attempt:ఏటీఎం చోరీకి విఫ‌ల‌యత్నం చేసిన అలారం మోగ‌డంతో పారిపోయాడు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి.. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ఏటిఎంలో చోరీకి దొంగ ప్ర‌యత్నం చేశాడు. కిసాన్ చౌక్ ఏరియాలోని ఓ లాడ్జి కింద ఉన్న డిబీఎస్ ఏటీఎంలోకి చొరబడిన దొంగ దాంట్లో దొంగ‌త‌నానికి ప్ర‌య‌త్నం చేశాడు. గడ్డపారతో ఏటీఎం మిషన్ ధ్వంసం చేశాడు. అదే స‌మ‌యంలో, లాకర్ ప‌గుల‌గొట్టేందుకు యత్నించాడు. మిషన్ ముందు డోర్ ఓపెన్ కావడం.. లాకర్ ను పగలగొట్టే స‌మ‌యంలో అలారం మోగింది. దీంతో పోలీసులు అప్ర‌మ‌త్తం కావ‌డంతో దొంగ పారిపోయాడు. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like