గ్రౌండ్ చదును… క్రీడాకారుల హర్షం

క్రీడాకారులు, స్థానిక ప్రజల సౌకర్యార్థం సింగరేణి యాజమాన్యం తీసుకుంటున్న చర్యలపై మాదారం వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా ఉన్న శ్రీ లాల్ బహుదూర్ క్రీడా ప్రాంగణం, వాకింగ్ ట్రాక్ చదును చేసేందుకు సింగరేణి అధికారులు తమ వంతు సహకారం అందించారు. మైదానం అభివృద్ధికి ముందుకు వచ్చిన యాజమాన్యంపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

స్థానిక ప్రజలు, యువకుల విజ్ఞప్తి మేరకు.. గ్రౌండ్‌లో వాకింగ్ ట్రాక్ ను సిద్ధం చేయడానికి సింగరేణి యాజమాన్యం ముందుకొచ్చింది. ఇందులో భాగంగా మైదానాన్ని చదును చేసి, ట్రాక్‌ను అనుకూలంగా మార్చడానికి సింగరేణి అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఒక బ్లేడ్ ట్రాక్టర్‌ను పంపించారు. ప్రస్తుతం గ్రౌండ్‌లో చదును చేసే పనులు చురుగ్గా సాగుతున్నాయి.

యువతను క్రీడల వైపు ప్రోత్సహించడంతో పాటు, ప్రజల ఆరోగ్య రక్షణ కోసం క్రీడా ప్రాంగణాన్ని అభివృద్ధి చేస్తున్న సింగరేణి సంస్థ నిర్ణయం పట్ల మాదారం వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ విజ్ఞప్తిని మన్నించి వెంటనే ట్రాక్టర్‌ను పంపించి గ్రౌండ్ పనులకు వేగంగా చర్యలు తీసుకున్న సింగరేణి యాజమాన్యానికి ఈ సందర్భంగా మాదారం గ్రామస్తులు, క్రీడాకారులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

You might also like