కేసుల పరిష్కారానికి ‘లోక్ అదాలత్’ అస్త్రం!
కేసుల పరిష్కారానికి ‘లోక్ అదాలత్’ అస్త్రం
రాజీకి అవకాశం ఉన్న కేసులను ఇరుపక్షాల అంగీకారంతో పరిష్కరించుకునే ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని మంచిర్యాల జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి వీరయ్య కోరారు. నవంబర్ 21న నిర్వహించనున్న ప్రత్యేక లోక్ అదాలత్ పై మంచిర్యాల జిల్లా బార్ అసోసియేషన్ కార్యాలయంలో న్యాయాధికారులు, న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జడ్జి వీరయ్య మాట్లాడుతూ.. రాజీకి అవకాశం ఉన్న కేసుల్లో కక్షిదారులు పరస్పర అంగీకారంతో సమస్యలను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. సాధారణ కోర్టు విచారణలతో పోలిస్తే లోక్ అదాలత్ ద్వారా సమయం, డబ్బు ఆదా అవుతాయని పేర్కొన్నారు. పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడంతో పాటు ఇరుపక్షాలకు సత్వర న్యాయం అందించడంలో లోక్ అదాలత్ కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. నవంబర్ 21న జరిగే ఈ కార్యక్రమంలో అర్హులైన కక్షిదారులు పాల్గొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
రాజీపడదగిన అన్ని క్రిమినల్ సివిల్ కేసులు, బ్యాంకు కేసులు, కుటుంబ వివాదాలు, చెక్బౌన్స కేసులను లోక్ అదాలత్ లో సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవచ్చన్నా రు. లోక్అదాలత్ లో రాజీమార్గం ద్వారా కేసులు పరిష్కారం చేసుకునేలా కృషి చేయాలన్నారు. వివిధ రకాల కేసుల్లో పెండింగ్లో ఉన్న వాటిని పరిష్కరించుకునేందుకు ఇది మంచి అవకాశమన్నారు. లోక్అదాలత్ పరిష్కా రం చేసుకుంటూ ఇరువురికీ న్యాయం లభించి నట్టేనని పేర్కొన్నారు.
క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదా కేసులు, ఆస్తి విభజన కేసులు, కుటుంబపరమైన కేసులు, వైవాహిక జీవితం సంబంధిత కేసులు, బ్యాంకు రికవరీ, చెక్ బౌన్స్ కేసులు,రోడ్డు ప్రమాదాలు ఇతర కేసులపై సంబంధించిన కేసులను ఇరుపక్షాల సమ్మతితో రాజీతో పరిష్కారమయ్యే కేసులన్నింటినీ పరిష్కరిస్తామని తెలిపారు.
రాజీ మార్గం రాజమార్గమని, చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని, డబ్బులను వృథా చేసుకోవద్దని సూచించారు. ఈ సమావేశంలో చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ నిర్మల, జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ నిరోషా, స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ సమిండ్ల రవేష్, స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఎక్సైజ్ తేజ, బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మంజుల, జాయింట్ సెక్రటరీ రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.