కలకలం రేపిన నానమ్మ, మనవరాలు మృతదేహలు..
The bodies of the grandmother and grandchildren, who caused a stir:ఓ నానమ్మ, ఆమె మనవరాలు అనుమానస్పద స్థితిలో మృత్యువాత పడ్డారు. వారిద్దరి మృతదేహాలు బెడ్ పై పడి ఉన్నాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఖమ్మం జిల్లాకు చెందిన ఓ కుటుంబం కొద్ది రోజుల కిందట మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోపాల వాడలో ఉంటున్నారు. వీరిలో కొడుకు ఈ నెల 4న ఖమ్మం వెళ్లాడు. రాత్రి ఫోన్ చేసినా తల్లి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఖమ్మంలో ఉన్న కొడుకు ఫోన్ చేసి స్థానికులకు సమాచారం ఇచ్చాడు. బస్తీ వాసులు ఎంత ప్రయత్నించినా తలుపులు తెరవక పోవడంతో స్థానికులు 100కు డయల్ చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి చూడగా, తలుపులు తెరిచి చూడగా నానమ్మ సత్యవతి (50)సంవత్సరాలు, మనవరాలు శిరీష (4) సంవత్సరాలు ఇంట్లోనే ఒకే బెడ్ పై అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు గుర్తించారు.
ఇది హత్యా..? లేక ఆత్మహత్యా…? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. కుటుంబీకులు వస్తే కానీ పూర్తి సమాచారం తెలియదని పోలీసులు చెబుతున్నారు.