పిడుగుపాటుకు ముగ్గురు బలి
Three killed in lightning strike: పిడుగుపాటుతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. నిర్మల్ జిల్లా పెంబి మండలం గుమ్మెఎంగ్లాపూర్ గ్రామంలో రైతులు పొలంలో వ్యవసాయ పనులు చేస్తుండగా ఆకాశం మబ్బులతో కమ్ముకుంది. కొద్దిసేపటికి ఉరుములు, మెరుపులతో గాలివాన మొదలైంది. ఈ క్రమంలో అకస్మాత్తుగా పిడుగు పడి రైతు దంపతులు ఎల్లయ్య, ఎల్లవ్వలతో పాటు రైతు కూలీ వెంకటి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలుసుకున్న స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.