ఇంటి పైకి ఎక్కిన ఎద్దు
The bull climbed onto the house:ఓ ఎద్దు ఇల్లు ఎక్కింది.. ఇల్లు ఎక్కేందుకు మెట్లు లేవు.. ఎక్కే అవకాశం కూడా లేదు.. కానీ ఆ ఎద్దు మాత్రం అమాంతం ఎక్కేసింది. ఎక్కడం అయితే ఎక్కింది కానీ, దిగడం తెలియదు.. దీంతో గ్రామస్తులు దానిని మెల్లిగా కిందకి దించారు… ఈ వింత ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం నీరాలలో గఫూర్ అనే వ్యక్తికి చెందిన ఎద్దు ఇల్లు ఎక్కింది. ఆ ఎద్దును తరుముతూ వీధి కుక్కలు వెంటపడ్డాయి. భయంతో పరుగులు పెట్టిన ఎద్దు పక్కనే ఉన్న చిన్న గోడ మీద నుంచి ఇంటి పైకి అమాంతం ఎగిరి ఎక్కేసింది. అక్కడి నుంచి దిగే పరిస్థితి లేకపోవడంతో దానిపైనే ఉండిపోయింది. ఇది గమనించిన గ్రామస్తులు ఇంటి పైనుంచి దాన్ని దింపారు. దించే క్రమంలో ఎందుకు గాయాలయ్యాయి. కుక్కల భయంతో ఇంటి పైకి ఎగిరిందని స్థానికులు వెల్లడించారు.
చాలా మందికి ఆ ఎద్దు ఇల్లు ఎలా ఎక్కిందనేది అర్థం కాలేదు. చూసిన వారు చెప్పడంతో ఔరా.. అని ముక్కున వేలేసుకున్నారు.