ఒక్క నియోజ‌క‌ర‌వ‌ర్గం… 40 వేల ఫిర్యాదులు…

Balka Suman:వీళ్లేంటి… ఏదో అట్ట‌పెట్ట‌లు మోసుకుపోతున్నార‌ని చూస్తున్నారా..? అవును అవి అట్ట‌పెట్టెలే కానీ.. అందులో ఉన్నయ్ మాత్రం ప్ర‌జ‌ల ఫిర్యాదులు.. అన్ని ఫిర్యాదులా..? అని ఆశ్చ‌ర్య‌పోకండి… అవును అవ‌న్నీ కేవ‌లం ఒక్క నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌చ్చిన‌య్ మాత్ర‌మే… దాదాపు న‌ల‌భై వేల ఫిర్యాదులు…

ఇంత‌కీ విషయం ఏమిటంటే.. తెలంగాణ‌లో త‌మ ప్ర‌భుత్వం ఉన్న‌ప్పుడే బాగుడేంద‌ని, కాంగ్రెస్ పార్టీ వ‌చ్చిన త‌ర్వాత ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని బీఆర్ఎస్ ఓ కార్య‌క్ర‌మానికి రూప‌క‌ల్ప‌న చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ప‌దిహేను రోజుల నుంచి అప్పుడే మంచి గుండె అనే కార్య‌క్ర‌మం కింద బీఆర్ఎస్ నేత‌లు ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లి ఫిర్యాదులు స్వీక‌రించారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్‌ చెన్నూర్ నియోజకవర్గ ప్రజల నుండి దాదాపు 40,000 ఫిర్యాదులను స్వీకరించి గురువారం మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వాటిని అధికారుల‌కు అందించారు. అద‌న్న‌మాట అస‌లు సంగ‌తి…

You might also like