స్థానిక ఎన్నిక‌ల‌పై స్టే

High Court:స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9పై హైకోర్టు స్టే విధించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9 పై హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంపై వాదనలు విన్న న్యాయస్థానం.. నేడు విడుదలైన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌పై కూడా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వం నాలుగు వారాల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. బీసీ రిజర్వేషన్లపై తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా పడింది.

రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వారాల వ్యవధిలో సమగ్ర కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు త‌న ఆదేశాల్లో పేర్కొంది. మరోవైపు.. పిటిషనర్లకు కూడా రెండు వారాల్లో తమ వాదనలకు సంబంధించిన సాక్ష్యాలు సమర్పించాలని ఆదేశించింది. హైకోర్టు తాత్కాలిక ఆదేశాల నేపథ్యంలో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌పై అస్పష్టత నెలకొంది. ఎన్నికల కమిషన్ అధికారులు కోర్టు ఆర్డర్ కాపీ అందిన తరువాత మాత్రమే తదుపరి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. దీంతో గ్రామ, మండల స్థాయిలో నిర్వహించాల్సిన ఎన్నికల షెడ్యూల్ తాత్కాలికంగా నిలిచిపోయింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like